top of page

ఉప ఎన్నిక వచ్చే.. బతుకులు మార్చే


మునుగోడు ఉపఎన్నికల ఆ ప్రాంత ప్రజలకు దరిద్రాన్ని వదిలించేలా ఉంది. ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి సంగతి పక్కన పెడితే ఇప్పుడు ఉపఎన్నికల పుణ్యమాని అక్కడి చిరువ్యాపారుల దందా మూడు పువ్వులూ ఆరు కాయలుగా మారింది. మునుగోడు ఉపఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుున్న అధికార, ప్రతిపక్ష పార్టీల ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే పోటాపోటీగా ప్రచారాని శ్రీకారం చుట్టాయి. తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలయిన టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ లు ఎలాగైనా విజయకేతనం ఎగురవేయాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. అందుకోసం ప్రతిపార్టీలోని లీడర్లు అందరు మరో మూడు నెలల పాటు మునుగోడులో మకాం వేశారు. ఇప్పటికే లీడర్ల పర్యటనలు, మీటింగులతో గ్రామాల్లో, మండలాల్లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. హోటళ్లు, లాడ్జిలు, రెస్టారెంట్లు, చాయ్​కొట్లు, ఫంక్షన్ హాల్స్​లో సందడి నెలకొంది. దీంతో ఇక్కడి వ్యాపారులు ఉప ఎన్నికను లాభసాటగా మారింది. నెల రోజుల వ్యవధిలోనే టీ, టిఫిన్, భోజనం, బిర్యానీ రేట్లను అమాంతంగా పెంచారు. అద్దె ఇండ్ల ధరలు డబుల్​చేసేశారు. వీఐపీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మునుగోడులో రాచకొండ అటవీ ప్రాంతం ఉండడంతో ఇక్కడ ఉండే ఫాంహౌజ్​లకు డిమాండ్ పెరిగింది. ఇక ఇదే సమయంలో నియోజకవర్గంలో గొర్రెలకు డిమాండ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఇక విందు ఏర్పాటు చేసిన ప్రతీ చోట మటన్, నాటు కోడి తప్పనిసరిగా ఉండాల్సిందే. దీంతో అమాంతంగా మటన్ ధరలు కూడా మటన్ షాపుల వాళ్లు పెంచారంటే నియోజకవర్గంలో ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక అక్కడ కొందరు జనాలు మటన్ షాపులకు వెళ్లి కొనుగోలు చెయ్యకుండా, సభలు సమావేశాలు ఎక్కడ పెడతారా అన్నది ఆరా తీస్తున్నారు. ఇక ఇప్పటి నుండే మునుగోడులో మద్యం ఏరులై పారుతుంది.


ఒకరిని మించి ఒకరు పోటీపడి నాన్ వెజ్ భోజనం పెట్టడం నియోజకవర్గంలోని ప్రజలకు, రాజకీయ పార్టీల నేతలకు పండుగలా మారితే, అభ్యర్థులకు మాత్రం పెద్ద తలనొప్పిగా తయారైంది. ఈ ఉప ఎన్నిక ప్రస్తానం పూర్తి అయ్యే సరికి ఎంత ఖర్చు అవుతుందో అన్న ఆందోళన వారిలో వ్యక్తం అవుతుంది. పొరపాటున నాన్ వెజ్ భోజనం పెట్టకపోతే ఎక్కడ తమ పార్టీ పైన సదభిప్రాయం పోగొట్టుకుంటామో అన్న ఉద్దేశంతో కచ్చితంగా నాన్ వెజ్ పెట్టాల్సిన పరిస్థితి మునుగోడు నియోజకవర్గంలో రాజకీయ పార్టీల అభ్యర్థులకు వచ్చింది. మొత్తానికి ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఎన్నికల ప్రలోభాలకు తెర తీసినట్లు మునుగోడులో రాజకీయం స్పష్టంగా చెబుతుంది. ఇక మునుగోడులో పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే, ముందు ముందు మరెంత రసవత్తరంగా మారుతుందో అని అందరూ భావిస్తున్నారు. ఇక డబుల్ బెడ్ రూమ్ పోర్షన్​రూ.4 వేల నుంచి రూ.5 వేలు ఉండేది. మునుగోడులో ఉప ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీల లీడర్లు వచ్చి రూంలు కావాలని అడుగుతున్నారు. మూడు నెలల వరకు ఉంటామని రూ. 10 వేలయినా సరే ఇస్తామని చెప్తున్నరు. మూడు నెలలకు అడ్వాన్స్ కూడా ఇచ్చిన్రు. మాములగా అభివృద్ది చేయని నాయకులు, ఈ సమయంలోనైనా తమకు ఉపాధి కల్పిస్తున్నారని ఈ మూడు నెలలైన నాలుగు రాళ్లు వెనకేసుకుంటామని చెబుతున్నారు.

bottom of page