top of page

పట్టువదలని ప్రభుత్వం: బండి సంజయ్ పాదయాత్రకు బ్రేక్ వేయాలని మరోసారి పిటిషన్..


తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు మరోసారి అడ్డతగిలేలా ఉంది. బండి సంజయ్ పాదయాత్రకు నిన్ననే కోర్టు క్లియరెన్స్ తెచ్చుకోవడంతో ఈ రోజు పున:ప్రారంభమయిన సంగతి తెలిసిందే. అయితే అంతలోనే అయితే హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ అప్పీల్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని సీజే ధర్మాసనాన్ని ప్రభుత్వం కోరింది. పాదయాత్ర కొనసాగితే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఈ పిటిషన్‌పై శుక్రవారం మధ్యాహ్నం 1.15 గంటలకు విచారణకు సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం అంగీకరించింది. తెలంగాణ సీజే ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం ఈరోజు ఈ పిటిషన్ పై విచారణ జరపనుంది. ప్రభుత్వం బండి సంజయ్ పాదయాత్రను మరోమారు నిలిపివేయాలని కోర్టు మెట్లెక్కిన నేపథ్యంలో కోర్టులో విచారణ పై సర్వత్రా ఆసక్తి కొనసాగుతుంది. ఆరునూరైనా పాదయాత్ర కొనసాగించి తీరుతామని, వరంగల్లో సభ నిర్వహించి తీరుతామని బీజేపీ శ్రేణులు తేల్చి చెప్పి కోర్టు మెట్లు ఎక్కారు. పాదయాత్రకు అనుమతి తీసుకున్న బీజేపీ నేతలు ఇప్పుడు సభ నిర్వహణకు కోర్టును ఆశ్రయించారు. బండి సంజయ్ పాదయాత్ర లో చోటుచేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రజా సంగ్రామ యాత్ర నిలిపివేయాలని వర్ధన్నపేట ఏసీపీ ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగిస్తే చట్టపరమైన చర్యలకు వెనుకాడబోమని తేల్చి చెప్పారు. ఇక ఈ నెల 23న పోలీసులు ఇచ్చిన నోటీసులను నిరసిస్తూ బిజెపి నేతలు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై విచారణ జరిపిన సింగిల్ జడ్జి ధర్మాసనం పాదయాత్ర కొనసాగింపుపై గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక అక్కడితో ఆగని తెలంగాణ ప్రభుత్వం ఆ ఉత్తర్వులపై కోర్టు మెట్లు ఎక్కి, బండి సంజయ్ పాదయాత్రకు బ్రేక్ వేయాలని ప్రయత్నిస్తోంది.

bottom of page