top of page

ఖమ్మంలో వైఎస్ షర్మిల అధికార పార్టీ నాయకులను చీల్చి చెండాడుతుందా?

Updated: Aug 25, 2022

ఖమ్మంలో వైఎస్ షర్మిల అధికార పార్టీ నాయకులను చీల్చి చెండాడుతుందా? మంత్రి పువ్వాడ అజయ్ కి వేసిన పంచులు పేలాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో ప్రజాప్రస్థానం పాదయాత్ర సాగిస్తున్న వైఎస్ షర్మిల మంత్రి పువ్వాడ అజయ్ అరాచకాలను తేటతెల్లం చేశారు.



పువ్వాడ ఒక కంత్రీ మంత్రి అని పువ్వాడ వైద్య కళాశాలకు ఇబ్బందని ప్రభుత్వ మెడికల్ కాలేజీని రానివ్వకుండా అడ్డుకుంటున్న విషయాన్ని హైలెట్ చేసి విమర్శల వర్షం గుప్పించి మంత్రికి బుద్ది వచ్చేలా చేశారని అక్కడి ప్రజలు చర్చించుకుంటున్నారు. మెడికల్ సీట్లు 3 కోట్ల రూపాయలకు అమ్ముకుంటూ నియంత ప్రవర్తిస్తూ వేధించడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసకున్నాడని ఆమే మండిపడటంతో తమకు షర్మిల అండగా ఉంటారని అక్కడి ప్రజలు చెప్పుకుంటున్నారు. ఇక ఆర్టీసీ మంత్రి గా ఉన్నప్పుడు పువ్వాడ కార్మికులను బ్రతుకులను రోడ్ల మీదకు తీసుకువచ్చారని, వారి యూనియన్లు సైతం లేకుండా చేసిన దుర్మార్గమైన వ్యక్తి అని దుయ్యబట్టడం..పోలీసులను పనొల్లాగా, కుక్కల్లాగా వాడుకోవడం మొగతనం కాదు ఒక రౌడీ షీటర్ గా వ్యవహరించడం గొప్పతనం కాదని దమ్ముంటే ప్రజలు ఇచ్చిన పదవితో వారికి మేలు చెయ్యి అని సవాలు విసరడంతో షర్మిల తమ కష్టాలు తీర్చడానికే వచ్చిందని అక్కడి పబ్లిక్ చెప్పుకుంటున్నారు.


పువ్వాడ అజయ్ ఉత్తి పుణ్యానికి మంత్రి అయ్యాడని మంత్రి అయ్యాక ఆ పదవికి విలువ తగ్గిందని, అతనికి హోదా తెలియదు హుందా అంటే కూడా తెలియదని విమర్శలు గుప్పించడంతో షర్మిల ఒక ఫైర్ బ్రాండ్ అని చెప్పుకుంటున్నారు ఖమ్మం వాసులు. ఎన్ని ఆస్తులు సంపాదించిన, ఎన్ని కబ్జాలు చేసిన దనదాహం తీరదని, ప్రభుత్వ ఆస్థులను సైతం కబ్జా చేసిన కొత్త బిచ్చగాడు అని పువ్వాడ అని మంత్రిపై విమర్శలు గుప్పించడంతో షర్మిల కూడా రాజశేఖర్ రెడ్డి వలే ప్రజల కోసం అవినీతి పరులను లెక్కచేయడం లేదని చెప్పుకుంటున్నారు. ఇవన్ని వెరసి షర్మిలకు ఖమ్మం జిల్లాలో విపరీతమైన బ్రాండ్ వాల్యూ పెరిగింది. దీంతో రానున్న రోజుల్లో వైఎస్సార్ తెలంగాణ పార్టీ జెండా ఖమ్మం అంతటా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇది నిజం కావాలంటే మరికొన్ని రోజుల వేచిచూడాల్సిందే.

bottom of page