పాలేరు లో పోటీ చేయనున్న వైఎస్ షర్మిలకు అక్కడి ప్రజలు మెజారిటీ కట్టబెట్టనున్నారు? పాలేరు గడ్డ ఇకపై షర్మిల అడ్డా అయినట్లేనా? అంటే ఖచ్చితంగా షర్మిల ఊరు పాలేరు అని చెప్పవచ్చు. తెలంగాణలో మరోసారి వైఎస్సార్ సంక్షేమ పాలన తీసుకురావడమే పార్టీ పెట్టిన షర్మిల ఇప్పడు మరో కీలక అడుగువేశారు. పాలేరు గడ్డ నుంచి ఎన్నికల సమరంలో కాలుపెట్టనున్నట్లు స్వయంగా వైఎస్ షర్మిల ప్రకటించడంతో ఒక్కసారి ఆ వార్త రాష్ట్ర వ్యాప్తంగా హైలెట్ గా నిలిచింది.

తెలంగాణ ఏర్పడ్డ నాటి నుంచి షర్మిల పాలేరు నుంచి పోటీ చేయాలని కోరుకుంటుండటంతోనే షర్మిల అక్కడి నుంచే బరిలోకి దిగుతున్నారని ప్రజలు చెప్పుకుంటున్నారు. ఆ మహానేత బిడ్డ గా ప్రజల కోసం పోరాడటం ఆమే రక్తం లోనే ఉందని..ప్రజల సంక్షేమం కోసం పాటుపడటం షర్మిల వ్యక్తిత్వంలోనే ఉందని ఎక్కడ ఏ సమస్యల ఉన్న షర్మిలనే అండగా ఉంటుడటంతోనే పాలేరు ప్రజలు షర్మిలకు భారీ మద్దతు తెలుపుతున్నారని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.
ఇక పాలేరులో షర్మిల గెలవడం సమస్య కాదు కాని కనీవినీ ఎరగని మెజారిటీతో కట్టబెట్టేందుకు కార్యకర్తలు సిద్దమవుతున్నారని అందరు చర్చించుకుంటున్నారు. రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచేలా పార్టీ కార్యక్రమాలు చేపట్టాలని కార్యకర్తలు సిద్దమవుతూనే..రాజశేఖర్ రెడ్డి సైనికులు ప్రతి కార్యక్రమానికి, ప్రతి పోరాటానికి ముందు వరుసలో ఉండాలని, వైఎస్సార్ తెలంగాణ పార్టీకే పాలేరు కార్యకర్తలు ఆదర్శం కాబోతున్నారని భావిస్తున్నారు. చరిత్ర లో కనివినీ ఎరగని మెజారిటీ కట్టబెట్టేందకు కార్యకర్తలు షర్మిలకు మాటివడంతో ఖచ్చితంగా అక్కడ భారీ మెజారిటీ దక్కడం ఖాయమనే చెప్పాలి. చూడాలి మరి ఎంత మెజారిటీ వస్తుందో తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.