top of page

ఖమ్మం పబ్లిక్ మీటింగ్ లో వైఎస్ షర్మిల చేసిన ఆరోపణలు ఏంటీ?

Updated: Aug 25, 2022

ఖమ్మం పబ్లిక్ మీటింగ్ లో వైఎస్ షర్మిల చేసిన ఆరోపణలు ఏంటీ? ఖమ్మం వాసులు షర్మిల చేసిన ఆరోపణలను నమ్ముతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఖమ్మంలో షర్మిల పాదయాత్ర గ్రాండ్ సక్సెస్ అయింది. రాజశేఖర్ రెడ్డి బిడ్డా తమకోసం వస్తుందని

ఖమ్మం బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ప్రజలు తండోపతండాలుగా తరలిరాడమే కాదు ఆమేకు మద్దతు తెలిపారు.

కేసీఆర్‌ ఇంట్లో అందరికీ ఉద్యోగాలు ఉంటే ప్రజలు మాత్రం అడుక్కు తినాలా అని ఘాటు వ్యాఖ్యలు చేయడం, తమ పార్టీ ఉద్యమంతోనే ప్రభుత్వంలో చలనం వచ్చినా ఉద్యోగాలు నోటిఫికేషన్ వేశారణ షర్మిల తెలియజెప్పడంతో ఆమేను ప్రజలు ఆదరిస్తున్నారని అందరూ చర్చించుకుంటున్నారు. అయితే కేసీఆర్ ఉద్యోగాల నోటిఫికేషణ్ పేరుతో మోరం మోసానికి పాల్పడే అవకాశం ఖచ్చితంగా ఉందని కాని నిరుద్యోగుల తరఫుణ పోరాడటానికి తాను ఎప్పుడు సిద్దంగానే ఉంటానని చెప్పడంతో షర్మిల మీద ప్రజలకు నమ్మకం పెరిగిందని రాజకీయ పండితులు విశ్లేషణలు చేస్తున్నారు.

ప్రాజెక్టుల పేరుతో రూ.70 వేల కోట్లు దోచు కోవడమే కాక రూ.లక్షల కోట్లు అప్పు తెచ్చి ప్రజలపై భారం మోపు తున్నారని, ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, రైతుల రుణమాఫీ, పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, వృద్ధులకు పింఛన్లు.. ఇలా ఏ హామీని నెరవేర్చకుండా తెలంగాణలో కేసీఆర్‌ మోసం చేయని వర్గం లేదని షర్మిల ధ్వజమెత్తుతుండటంతో షర్మిల ఎక్కడికెళ్లిన బ్రహ్మరథం పడుతున్నారని ఖమ్మం వాసులు చెబుతున్నారు.

ప్రశ్నించే ప్రతిపక్షాలు గుడ్డి గుర్రాల పళ్లు తోముతు న్నాయని.. ఇక్కడ ఉన్నది వైఎస్సార్‌ బిడ్డ.. పులి కడుపున పులే పుడు తుంది.. నా గతం ఇక్కడే.. నా బతుకు ఇక్క డే.. ఈ గడ్డకు సేవ చేసే హక్కు నాకు ఉంది’ అని షర్మిల చెబుతుండటంతో రాజశేఖర్ రెడ్డే తమ కోసం వచ్చినట్లుందని అందరు చెప్పుకుంటున్నారు.దీంతో రానున్న రోజుల్లో షర్మిల పార్టీకి ప్రజలు భారీగా మద్దతు తెలపడమే కాదు బంపర్ మెజారిటీ కట్టబెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. చూడాలి మరి ఇది జరగాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.


bottom of page