top of page

బీజీపీ, టీఆర్ఎస్ లు రాష్ట్రంలో చిచ్చు పెడుతున్నాయి: రేవంత్ రెడ్డి.


టీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై విరుచుకుపడ్డారు. ఎవరైతే కాంగ్రెస్ ముక్త్ భారత్ అని చెబుతున్న వాళ్ళు రాష్ట్రంలో కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. గుజరాత్ నుంచి కొంతమంది దేశ దిమ్మరులు హైదరాబాద్ వచ్చారని పేర్కొన్న రేవంత్ రెడ్డి, మోడీ ఆదేశాలతో హైదరాబాద్ వచ్చారా? లేదా మీకు మీరే హైదరాబాద్ వచ్చారా? అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను టార్గెట్ చేశారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడం కోసం రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక కేసీఆర్ పై కూడా రేవంత్ విమర్శలు చేశారు. కెసిఆర్ సొంత చరిత్ర రాసుకోవాలని చూస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అందెశ్రీ గేయమైన జయజయహే తెలంగాణా గేయాన్ని రాష్ట్ర అధికారిక గేయంగా మారుస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. కెసిఆర్ సృష్టించిన తెలంగాణ తల్లి దొరల కోసమని పేర్కొన్న రేవంత్ రెడ్డి సబ్బండ వర్గాల తెలంగాణా తల్లి నమూనాను విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర జెండాపై సీనియర్ నేతల నుండి సలహాలు తీసుకుని అందరి సలహాలతో జెండాను సిద్ధం చేస్తామని రేవంత్ రెడ్డి తెలియజేశారు.


ఇక ఇదే సమయంలో గాంధీభవన్లో తెలంగాణ విలీన వేడుకలను నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. రేవంత్ రెడ్డి గాంధీభవన్లో జాతీయ జెండాను ఎగురవేసి తెలంగాణ గీతంగా జయ జయహే తెలంగాణ గీతాన్ని ఆలపించారు. దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, పొన్నాల లక్ష్మయ్య తదితర కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు పాల్గొన్నారు. జవహర్ లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్ విగ్రహానికి రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు నివాళులు అర్పించారు. విలీన వేడుకల సందర్భంగా రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను ఆవిష్కరించారు. తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించేలా జెండాను తయారు చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాటం లో నల్గొండ కీలక పాత్రను పోషించిందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఎందరో మహానుభావులు తమ వీరోచిత పోరాటాలతో నాటి పెత్తందార్లను తరిమికొట్టారని రేవంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ విమోచన కల్పించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ కు నివాళి అర్పించే అర్హత బిజెపికి లేదని మండిపడ్డారు.

bottom of page