top of page

మును'గోడు' కాంగ్రెస్ అభ్యర్థి ఖరారయ్యేనా..?

కాంగ్రెస్ పార్టీకి మునుగోడు ఉపఎన్నిక పెద్ద సవాల్ ని తెచ్చిపెట్టిం

ది. ఓ వైపు బీజేపీ రోజు రోజుకు తమ బలం పెంచుకుంటా టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యాహ్నాయంగా ఎదుగుతుంటే కాంగ్రెస్ మాత్రం ఎప్పుడు ఉండే అంతర్గత కుమ్ములాటలతో మరోసారి రాజకీయంగా సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కుంటోంది. అయితే ఎన్నికల సమయంలో సరైన సమయంలో పార్టీ అభ్యర్థుల టికెట్ విషయంలో జాప్యం చేసి భారీ మూల్యం చెల్లించుకుంటుంది. ఇప్పుడు కూడా ఆ పార్టీకి మునుగోడు అభ్యర్థిని ఖరారు చేయడం తలకు మించిన భారాన్ని తెచ్చిపెట్టేట్లు ఉంది. మునుగోడులో గెలుపు సాధించాలని అధికారంలో ఉన్న టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్..బీజేపీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ క్రమంలో మూడు పార్టీలు అభ్యర్థి ఎంపికలో బిజీ బిజీగా ఉన్నాయి. దీంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీలో మునుగోడు అభ్యర్థి ఎవరు అనేదానిపై కసరత్తులు జరుగుతున్నాయి. మరోపక్క టికెట్ నాకంటే నాకు అంటూ నేతలు పోటీ పడుతున్నారు. టికెట్‌ ఆశిస్తున్న పలువురు నేతలు.. ఎవరికివారుగా అధిష్ఠానానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇస్తే తమకే టికెట్‌ ఇవ్వాలని.. లేదంటే సహాయ నిరాకరణ తప్పదని వార్నింగ్ ఇస్తున్నారు. దీనికితోడు చెలమల కృష్ణారెడ్డిని కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఖరారు చేశారంటూ వస్తున్న వార్తలపై పాల్వాయి స్రవంతి తీవ్రస్థాయిలో స్పందించారు. కాంగ్రెస్ లో 30 ఏళ్లుగా పనిచేస్తున్నాను కాబట్టి ఈ ఉప ఎన్నికలో టికెట్ తనకే ఇవ్వాలని మునుగోడులో 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన పాల్వాయి గోవర్థన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి పట్టుబడుతున్నారు. ఇలా ఓ వైపు మునుగోడులో తిరిగి కాంగ్రెస్ పార్టీ అస్థిత్వాన్ని నిలబెట్టుకోవడం మరోవైపు ఆశావహులను బుజ్జగించడం వంటి అంశాలపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ చేసింది. ఇందులో భాగంగానే ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎంపికపై కసరత్తు ప్రారంభించింది. కాగా, తెలంగాణ కాంగ్రస్‌ ఇన్‌ఛార్జ్‌ మాణిక్యం ఠాగూర్‌.. గాంధీభవన్‌కు మునుగోడు టికెట్‌ ఆశావహులను సమావేశానికి పిలిచారు. ఇక, మునుగోడులో టికెట్‌ ఆశిస్తున్న వారిలో పాల్వాయి స్రవంతి, కృష్ణారెడ్డి, పల్లె రవి, కైలాష్‌ నేత ఉన్నారు. కాగా, ఆశావహుల బలాబలాపై సునీల్‌ కనుగోలు ఇప్పటికే పీసీసీకి నివేదిక అందించారు. ఈ నేపథ్యంలో మరో రెండు, మూడు రోజుల్లో మునుగోడులో అభ్యర్థిని కాంగ్రెస్‌ పార్టీ ఫైనల్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎప్పటిల కాకుండా ఈ సారైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ముందుగానే ప్రకటిస్తే ఈ పార్టీకి లాభ చేకరునుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

bottom of page