
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి సూసైడ్ బీఏస్పీ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గళం విప్పారు.బాసర IIIT విద్యార్థుల పై పోలీసులు పెట్టిన కేసులను తీవ్రంగా ఖండిస్తున్నా. నిజంగా బాసర IIIT విషయంలో ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి పై 306 IPC and 420IPC సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలి. విద్యార్థులారా, ఈ దొంగ కేసులకు భయపడకండి. మన బహుజనరాజ్యం రాబోతున్నదని ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు.ఈ-1కు చెందిన రాథోడ్ సురేష్ అనే సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థి హాస్టల్‌లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సురేష్ ఆత్మహత్యతో క్యాంపస్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. క్యాంపస్‌లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యార్థి ఆత్మహత్య యత్నం చేసిన అధికారులు స్పందించడం లేదని మండిపడ్డారు. ఆస్పత్రికి తరలించడంలో ఆలస్యం జరగడం వల్లే సురేష్ ప్రాణాలు కోల్పోయాడని కొందరు విద్యార్థులు ఆరోపించారు. క్యాంపస్‌లోని పలు విద్యార్థులు ధ్వంసం చేశారు. ఇక, సురేష్ మృతికి గల కారణాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇక క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు విద్యార్థులు. ఆత్మహత్య చేసుకున్న సురేష్ ఆత్మకు శాంతి కలగాలంటూ నివాళులర్పించారు. అధికారుల ఆంక్షలను లెక్క చేయకుండా క్యాంపస్‌లో భారీ ర్యాలీ తీశారు. పోలీస్ వాహనం ధ్వంసం ఘటనలో ఐదుగురు విద్యార్ధులపై కేసులు నమోదు చేశారు. 341, 353, 332, 427 r/w, 34 IPC సెక్షన్ల ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేశారు పోలీసులు. దాంతో విద్యార్ధులపై అక్రమ కేసులు ఎత్తివేయాలంటూ క్యాండిల్ ర్యాలీలో నినాదాలు చేశారు విద్యార్థులు. అలాగే సురేష్ మృతికి కారణమైన అధికారులను పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ క్యాంపస్‌లో ర్యాలీ నిర్వహించారు. అక్రమ కేసులు నమోదుచేసి తమను క్యాంపస్ నుంచి వెళ్లగొట్టాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు విద్యార్ధులు. ఇద్దరు విద్యార్థుల నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో బాసర ఐఐఐటీలో చదువుచున్నవారు మెరికల్లాంటి విద్యార్థులు. కాబట్టి వారిని మొగ్గ దశలోనే త్రుంచి వేయాలని ప్రభుత్వం కుట్రపన్ని వారికి సరైన వసతులు కల్పించకుండా నిరాశకు గురిచేసి వారి జీవితాలను అర్ధాంతరంగా బలి తీసుకుంటుంది బీఎస్సీ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు.